సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ దుబాయ్‌లో ప్రారంభం కాగా, ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇక రెండో షెడ్యూల్ కూడా ఇటీవల ప్రారంభం కాగా, మరో రెండు రోజుల్లో ఇది పూర్తి కానుందని సమాచారం. కాగా, దుబాయ్ షెడ్యూల్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో మిగతా మూవీ చిత్రీకరణ జరగనున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే.. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల దుబాయ్ వెళ్లి మహేష్‌ను కలిసి వచ్చాడు. దాంతో ఈ పాటల గురించి మహేష్ అభిమానులు తమన్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా పాటల గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వమని తాజాగా ఓ అభిమాని ట్విటర్ ద్వారా తమన్‌ను అడిగాడు. దీనికి స్పందించిన తమన్.. “సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. ఈ సినిమా పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయి. అది మాత్రం ఫిక్స్. ఆగస్టులో కలుద్దాం” అని రిప్లై ఇచ్చాడు. దీంతో ‘సర్కారు వారి పాట’ తొలి పాట మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టులో విడుదల కాబోతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
కాగా, బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్ మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట.