నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ మూవీ చివరిదశ షూటింగ్ జరుపుకుంటుండగా, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ మధ్యే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించనున్నాడు.
అయితే, తాజాగా బయటకు వచ్చిన ప్రభాస్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కోర మీసాలతో స్మార్ట్‌లుక్‌తో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. ‘ఆదిపురుష్’ లోని రాముడి పాత్ర కోసమే ప్రభాస్ మీసకట్టు మార్చాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. రాముని పాత్రలో అలరించేందుకు ప్రభాస్ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాడని, ఆ విషయం ఫొటో చూస్తే ఇట్టే తెలిసిపోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో కళ్లజోడు, తలకు క్యాప్ పెట్టుకుని ఉన్న ప్రభాస్ కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా ట్విటర్లో #Adipurush హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.