Home సినిమాలు సందీప్ కిషన్ A1 ఎక్స్‌ప్రెస్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రబృందం

సందీప్ కిషన్ A1 ఎక్స్‌ప్రెస్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రబృందం

‘ప్రస్థానం’తో వెండితెర మీద ప్రయాణాన్ని మొదలు పెట్టిన హీరో సందీప్‌ కిషన్‌. వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నా సరైన హిట్లు పడటం లేదు. దీంతో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఆయన ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’‌ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిదేనని ఆయన గతంలోనే ప్రకటించాడు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా మంచి స్పందన లభించింది. 

అయితే, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రబృందం. మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్, పోస్టర్స్, ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ కిషన్ 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ లుక్‌లో ఆయన అలరించనున్నారు.

ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా వన్నెం నిర్మించారు. మురళీ శర్మ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు