మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా.. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. అద్భుత విజయాన్ని అందుకున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు వారి జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. తాజాగా ‘ఉప్పెన’ సినిమాను చూసిన మహేష్ బాబు.. సినిమా చాలా బాగుంది అని కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు.
“అద్భుత సినిమాగా ‘ఉప్పెన’ను తెరకెక్కించావు బుచ్చిబాబు. ఇదొక క్లాసిక్. నిన్ను చూసి గర్వాపడుతున్నాను అని దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు మహేష్. అలానే వైష్ణవ్, కృతిలను మీరు నిజమైన స్టార్స్ అని కొనియాడారు. కాగా, మహేష్ ట్వీట్‌పై స్పందించిన కృతిశెట్టి.. ఓ మైడ్ గాడ్ థ్యాంక్ యూ సర్.. మా కష్టానికి ఫలితం కనిపించింది. ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్‌కు తెగ సంతోషిస్తుంది. మీలాంటి సూపర్ స్టార్ మమ్మల్ని స్టార్ అని పిలవడం అద్భుతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సోమచ్ సర్ అంటూ ట్వీట్ చేసింది.
ఇక మహేష్ ట్వీట్‌పై దర్శకుడు బుచ్చిబాబు సన కూడా స్పందించాడు. మీరు మమ్మల్ని పొగడడం చాలా ఆనందంగా ఉంది సర్.. ఉప్పెన సినిమా చూసి మీరు స్పందించడం సంతోషంగా ఉంది. నా తొలి హీరో నుండి ఇలాంటి మాటలు రావడం ఎప్పటికీ స్పెషల్ . నిజమైన సూపర్ స్టార్ సర్ మీరు అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ కూడా మహేష్ ట్వీట్‌కు సంతోషం వ్యక్తం చేశాడు. అలానే ఒక యువ హీరోను ప్రోత్సహించినందుకు సాయిధరమ్ తేజ్ కూడా మహేష్‌కు ధన్యవాదాలు తెలిపారు .