Home సినిమాలు 'నాంది' కలెక్షన్ల ప్రభంజనం: మూడు రోజుల్లో ఊడ్చేసిన అల్లరి నరేష్

‘నాంది’ కలెక్షన్ల ప్రభంజనం: మూడు రోజుల్లో ఊడ్చేసిన అల్లరి నరేష్

టాలీవుడ్‌ కామెడీ హీరో అల్లరి నరేష్ ‘నాంది’ అనే డిఫరెంట్ సబ్జెక్టుతో ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న ఆయనకు ఈ మూవీ కాస్త ఊరటనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సహా ఇతర అప్‌డేట్స్ అన్నీ విడుదలకు హైప్ తీసుకురావడంతో చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చాయి. పోటీగా మరికొన్ని సినిమాలున్నా కలెక్షన్స్ పరంగా ‘నాంది’ ముందు వరుసలో నిలిచింది.

ఇక తొలి రెండు రోజులతో పోల్చితే ‘నాంది’ మూడో రోజు కలెక్షన్స్ ఫర్వాలేదనిపించాయి. మూడో రోజు ఆదివారం కావడం, పైగా సినిమాకు పాజిటీవ్ టాక్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. మూడో రోజుకు గాను 1.91 కోట్ల గ్రాస్, 1.04 కోట్లు షేర్ రాబట్టి అల్లరి నరేశ్ అదరగొట్టాడు.

‘నాంది’ మూడో రోజు కలెక్షన్స్ రిపోర్ట్స్ పరిశీలిస్తే…
◆ నైజాం- 47 లక్షలు◆ సీడెడ్- 15 లక్షలు◆ ఉత్తరాంధ్ర- 6.2 లక్షలు◆ ఈస్ట్‌ గోదావరి- 8.2 లక్షలు◆ వెస్ట్‌ గోదావరి- 5.5 లక్షలు◆ గుంటూరు- 8.4 లక్షలు◆ కృష్ణా- 9 లక్షలు◆ నెల్లూరు- 4.8 లక్షలు 
ఇక మొత్తంగా ‘నాంది’ మూడు రోజుల కలెక్షన్ రిపోర్ట్స్ పరిశీలిస్తే.
..
◆ నైజాం- 93 లక్షలు◆ సీడెడ్- 29 లక్షలు◆ ఉత్తరాంధ్ర- 19 లక్షలు◆ ఈస్ట్‌ గోదావరి- 16 లక్షలు◆ వెస్ట్‌ గోదావరి- 12 లక్షలు◆ గుంటూరు- 17 లక్షలు◆ కృష్ణా- 18 లక్షలు◆ నెల్లూరు- 10 లక్షలు

ఇప్పటివరకు ‘నాంది’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.86 కోట్ల గ్రాస్, 2.14 నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4.05 కోట్ల గ్రాస్, 2.28 కోట్ల షేర్ వసూలైంది.

అత్యంత ప్రముఖమైనవి

సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మూవీ రివ్యూ:

నటీనటులు : సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేశ్‌, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు ...

టీ విరామ సమయానికి భారత్ 153/6

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు...

కోహ్లీ “డక్ అవుట్” రికార్డు

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు మొదటి సెషన్ లో కోహ్లీ స్టోక్స్ బౌలింగ్ లో డక్ అవుట్...

పవన్-రానా సినిమా ఫోటోలు లీక్.. ఇందులో పవన్ కల్యాణ్ ఎలా కనిపిస్తున్నాడంటే

ఏమని చెప్పాలి.. ఎంతని భయపెట్టాలి.. అయినా ఎంత భయపెట్టినా కూడా అక్కడేం జరుగుతుంది..? ఇప్పుడు లీకుల విషయంలో చిత్రపరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా.....

ఇటీవలి వ్యాఖ్యలు