మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లూసిఫర్’ మూవీ సందడి ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించనున్నారు. డైరెక్టర్ మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆర్బీచౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
అయితే ‘లూసిఫర్’ కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అపడేట్ వెలుగులోకి వచ్చింది. మలయాళ సూపర్ హిట్మూవీ లూసిఫర్ రీమేక్‌లో మంజు వారియర్ పాత్రలో మరో సీనియర్ నటి సంతకం చేసినట్టు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ నయనతార ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదని నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలో మరో హీరోయిన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది అనేది తాజా సమాచారం. చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య మూవీలో లీడ్ రోల్ పోషించాల్సిన త్రిష అనూహ్యంగా వైదొలిగింది. మెగాస్టార్ సూపర్ హిట్ స్టాలిన్ సినిమాలో జోడీగా నటించిన త్రిష, కథ నచ్చడంతో లూసిఫర్‌లో నటించేందుకు సంతకం చేసిందట. భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ క్రేజీ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదికి రానుంది. అలాగే ఈ మూవీలో కీలకమై హీరో అనుచరుడి పాత్రను యువ కథానాయకుడు సత్యదేవ్ అలరించనున్నాడు.