Home సినిమాలు 'ఉప్పెన' ఓటీటీలో విడుదల ఎప్పుడంటే..!

‘ఉప్పెన’ ఓటీటీలో విడుదల ఎప్పుడంటే..!

రూ.7 కోట్లకు ‘ఉప్పెన’ డిజిట‌ల్ రైట్స్ కొనుగోలు.. ఓటీటీలో విడుదల ఎప్పుడంటే..!
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై అద్భత విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. రెండో వారంలో కూడా ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిజానికి ఈ సినిమా మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన సొమ్ము మొత్తాన్ని వసూలు చేసేసి లాభాల్లోకి వెళ్లిపోయింది.

ఇదిలావుంటే..బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెను సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని త‌మిళం, హిందీలో రీమేక్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అలాగే ఈ సూపర్‌ హిట్‌ మూవీని ఓటీటీలోకి కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

మరోవైపు ‘ఉప్పెన’ చిత్రాన్ని తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు వీక్షించారు. అనంతరం ఆయన ట్విట్టర్‌ ద్వారా యూనిట్‌ను అభినందించారు. “‘ఉప్పెన’ గురించి ఒక మాటలో చెప్పాలంటే క్లాసిక్‌ మూవీ. బుచ్చిబాబు నువ్వొక గొప్ప సినిమాను తెరకెక్కించావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి వంటి కొత్త హీరో హీరోయిన్స్‌ తన అభినయంతో హృదయాలను దోచుకున్నారు. మీరు నిజమైన స్టార్స్‌. ఉప్పెన వంటి సినిమాను వెనుక ఉండి సపోర్ట్ చేసిన సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌కు అభినందనలు” అని మహేశ్‌ ట్వీట్ చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మూవీ రివ్యూ:

నటీనటులు : సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేశ్‌, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు ...

టీ విరామ సమయానికి భారత్ 153/6

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు...

కోహ్లీ “డక్ అవుట్” రికార్డు

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు మొదటి సెషన్ లో కోహ్లీ స్టోక్స్ బౌలింగ్ లో డక్ అవుట్...

పవన్-రానా సినిమా ఫోటోలు లీక్.. ఇందులో పవన్ కల్యాణ్ ఎలా కనిపిస్తున్నాడంటే

ఏమని చెప్పాలి.. ఎంతని భయపెట్టాలి.. అయినా ఎంత భయపెట్టినా కూడా అక్కడేం జరుగుతుంది..? ఇప్పుడు లీకుల విషయంలో చిత్రపరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా.....

ఇటీవలి వ్యాఖ్యలు