Home సినిమాలు 'నాంది' 4 డేస్ కలెక్షన్స్.. ఆ అరుదైన ఘనతకు అడుగు దూరంలో అల్లరి నరేష్

‘నాంది’ 4 డేస్ కలెక్షన్స్.. ఆ అరుదైన ఘనతకు అడుగు దూరంలో అల్లరి నరేష్

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్.. అప్పుడప్పుడూ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కథాంశం ‘నాంది’తో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పు పొందుతున్నారు. ప్రయోగాత్మకమైన ఈ సినిమా ఫిబ్రవరి 19వ తేదీన విడుదలైంది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా వారెవ్వా అనిపించుకుంటోంది. రోజు రోజుకూ ఈ మూవీ కలెక్షన్స్ పుంజుకుంటూ రావడం విశేషం.

తొలి మూడు రోజులతో పోల్చితే నాలుగో రోజు కలెక్షన్స్ చిత్రబృందాన్ని ఆనంద పెట్టాయి. సినిమాకు పాజిటివ్‌ టాక్ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు జరిగాయి. కాగా, నాలుగో రోజు సాధించిన కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వెళ్ళింది ‘నాంది’ సినిమా. కొన్ని ఏరియాల్లో అయితే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కి ఒక్క అడుగు దూరంలో ఉన్న అల్లరి నరేష్ ఈ రోజు కలెక్షన్స్‌తో ఆ ఘనత సాధిస్తాడాని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘నాంది’ నాలుగో రోజు కలెక్షన్ల రిపోర్ట్ పరిశీలిస్తే..
◆ నైజాం-18 లక్షలు◆ సీడెడ్‌- 8 లక్షలు◆ ఉత్తరాంధ్ర- 4.4 లక్షలు◆ ఈస్ట్ గోదావరి- 3.3 లక్షలు◆ వెస్ట్ గోదావరి- 2.5 లక్షలు◆ గుంటూరు- 3.9 లక్షలు◆ కృష్ణా- 3.7 లక్షలు◆ నెల్లూరు- 2.1 లక్షలు

‘నాంది’ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా నాలుగో రోజుకు గాను 46 లక్షల షేర్, 85 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 3 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ‘నాంది’ మూవీ మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా తొలి నాలుగు రోజుల్లో 2.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

అత్యంత ప్రముఖమైనవి

‘ఉప్పెన’లో రామ్ చరణ్ అన్న అలా చేయమన్నాడు: వైష్ణవ్‌ తేజ్

డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్‌, దర్శకుడు. వైష్ణవ్‌ తేజ్‌, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం....

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. ‘రామ్‌జెట్’ టెక్నాల‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం

గగనతలంలో సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణుల వేగాన్ని గణనీయంగా పెంచే సాంకేతిక వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించి చూసింది.ఈ టెక్నాలజీ వల్ల మన క్షిపణులు గగనతలంలో దూసుకెళ్లే వేగం ఎక్కువవుతుంది....

బట్టల రామస్వామి బయోపిక్ టీజర్

అంతా కొత్త వారితో వస్తున్న చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్”.  అల్తాఫ్ హాసన్, శాంతి రావు ప్రధాన పాత్రధారులు.  సతీష్ కుమార్, రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్...

టైం మ్యాగజైన్ – మహిళా దినోత్సవం ప్రత్యేక సంచిక

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ప్రముఖ మ్యాగజైన్ “టైం”ప్రత్యేక సంచిక విడుదల చేసింది.  దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న మహిళా రైతుల ఫోటో తో కవర్ పేజిని...

ఇటీవలి వ్యాఖ్యలు