Home సినిమాలు నాని ‘టక్‌ జగదీష్‌’ టీజర్ చూశారా.. నేచురల్‌ స్టార్‌ ఓ రేంజ్‌లో అదరగొట్టేసాడుగా..

నాని ‘టక్‌ జగదీష్‌’ టీజర్ చూశారా.. నేచురల్‌ స్టార్‌ ఓ రేంజ్‌లో అదరగొట్టేసాడుగా..

‘నిన్నుకోరి’ తర్వాత నేచురల్‌స్టార్‌ నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతోన్న సూపర్‌హిట్‌ చిత్రం ‘టక్‌ జగదీశ్‌’. రీతూవర్మ కథానాయిక. ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒక డైలాగ్‌ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు. తన కుటుంబం కోసం జగదీష్‌ ఏం చేశాడో ఆసక్తికరంగా చూపించారు. 

కాగా, షైన్‌ స్ర్కీన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ రెండో హీరోయిన్‌ పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కళ: సాహి సురేష్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

అత్యంత ప్రముఖమైనవి

సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మూవీ రివ్యూ:

నటీనటులు : సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేశ్‌, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు ...

టీ విరామ సమయానికి భారత్ 153/6

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు...

కోహ్లీ “డక్ అవుట్” రికార్డు

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు మొదటి సెషన్ లో కోహ్లీ స్టోక్స్ బౌలింగ్ లో డక్ అవుట్...

పవన్-రానా సినిమా ఫోటోలు లీక్.. ఇందులో పవన్ కల్యాణ్ ఎలా కనిపిస్తున్నాడంటే

ఏమని చెప్పాలి.. ఎంతని భయపెట్టాలి.. అయినా ఎంత భయపెట్టినా కూడా అక్కడేం జరుగుతుంది..? ఇప్పుడు లీకుల విషయంలో చిత్రపరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా.....

ఇటీవలి వ్యాఖ్యలు