వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా వైష్ణవ్, కృతి, విజయ్ సేతుపతిల నటన బుచ్చిబాబు టేకింగ్ సినిమాను విజయపథంలో నడిపాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అలాగే, 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషలలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. తమిళంలో విజయ్ తనయుడు సంజయ్ రీమేక్ చేయనున్నాడని ఇటీవల వార్తలు రాగా, ఇప్పుడు హిందీలోను రీమేక్ కానున్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.