సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్, కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న సినిమా ‘రంగ్ దే’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు చిత్రబృందం. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, మార్చి 26న ఈ ఫన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో నితిన్ ఓ ఫన్నీ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు.
‘గివ్ మీ సమ్ లవ్’ అనే ఆసక్తికర ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ రంగ్ దే మూవీ నితిన్ కెరీర్లో 29వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రంగ్ దే పోస్టర్లు టీజర్ కి చక్కని స్పందన వచ్చింది. ఈ చిత్రానికి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం ప్రధాన హైలైట్ కానుంది. ఆయన షూటింగ్ ముగింపు వేళ సరదా ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు. వాటిని నితిన్ ట్విట్టర్ లో రివీల్ చేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.