తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకు కరోనా పడగ విప్పుతోంది.
తెలంగాణాలో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1590 కేసులు వచ్చాయి. ఇందులో 80% కేసులు GHMC లో నమోదైనాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా రాష్ట్రంలో కేవలం 1,15,835 మందికి పరీక్షలు చేశారు. ఇందులో, ఇప్పటి దాకా 23902 మందికి పాజిటివ్ అని తేలింది. వీటిలో మరణాల శాతం 1.23% (295) కాగా, పరీక్ష చేసిన వారిలో 20.63% (23902) మందికి పాజిటివ్ గా తేలింది. మరణాల శాతం తక్కువగా ఉన్నా, పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యం గా తెలంగాణాలో అనేక సమస్యలు వినిపిస్తున్నాయి. పేషెంట్స్, హాస్పిటల్ లో నుంచి విడుదల చేస్తున్న సెల్ఫీ వీడియోలు సామాన్య ప్రజలను కలవర పెడుతోంది. కరోనా కన్నా, కరోనా వస్తే, సరైన సమయానికి ట్రీట్మెంట్ అందుతుందో లేదో అన్న భయం ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది.
Lockdown చేస్తే ధన నష్టం చేయక పొతే ప్రాణ నష్టం – సంకట స్థితిలో ఉన్న ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం తో ముందుకు సాగాలి. అయితే,రోజు రోజుకి కేసులు పెరగుతుం ఉండటం వలన, హైదరాబాద్ లో పరిస్థితి మాత్రం భయాందోళనలు కలిగిస్తోంది
కరోనా పరీక్షల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ చాలా ముందుంది. ఇప్పటి దాకా అక్కడ 10 లక్షల మందికి పైగా పరీక్షలు చేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ కేసు ల పరిస్థితి తెలంగాణ లో భిన్నంగా ఉంది. ఇప్పటి దాకా ఇక్కడ మరణాల శాతం 1.44% (232) కాగా, పరీక్ష చేసిన వారిలో 1.58% (16102) మందికి మాత్రమే పాజిటివ్ అని తేలింది.
త్వరలో మనమందరం ఈ కరోనా మహమ్మారి నుండి బయట పడాలని ఆశిద్దాం.