ఇప్పటి వరకు, రాష్ట్ర వ్యాప్తం గా 27612 కేసులు నమోదు కాగా 313 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 1879 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో కేసుల తీవత్ర ఎక్కువగా ఉండడం తో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. రోజు కు కనీసం గా 1500 కి పైగా కేసులు వస్తున్నాయి. చాల మంది హైదరాబాద్ వదిలి వారి వారి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఒక పక్కా కరోనా మరొక పక్క డెంగీ ఫీవర్ భయం.
దేశ వ్యాప్తం గా సుమారు ఏడున్నర లక్ష ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కావున మాస్క్ లు ధరించడం, బౌతిక దూరం పాటించడం, శుభ్రత, చేతులు తరచూ సబ్బు తో కడుక్కోవడం, పోషకాహారం తీసుకోవడం, వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం వంటి జాగ్రత్తలతో మనల్ని మనం కరోనా నుంచి కాపాడుకోగలం.
మనకు మనమే స్వీయ జాగ్రత్తలతో నే కరోనా నుంచి బయట పడగలం అనేది అక్షర సత్యం