కర్ణాటక రాష్ట్ర వ్యాప్తం గా శనివారం 2798 కరోనా కేసులు నమోదయ్యాయి అంతే కాకుండా 70 మంది మృతి చెందారు. దీనితో, రాష్ట్రంలో ఇప్పటి దాకా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 33418 కు చేరింది. మృతుల సంఖ్య 543 కు చేరింది.
కరోనా తీవ్రత దృష్ట్యా , కర్ణాటక రాజధాని బెంగుళూరు మళ్ళి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రం అ న్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తుండగా, రాష్ట్రాలు మాత్రం పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతుండడం వలన ముఖ్య మంత్రి ఎడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు సగటున రాజధాని బెంగుళూరు లో వెయ్యికి పైగా కేసు లు నమోదవుతున్నాయి. జూలై 14 నుంచి అనగా మంగళవారం నుండి, బెంగుళూరు నగరంలోనూ, బెంగుళూరు చుట్టూ ప్రక్కల గ్రామీణ జిల్లా ప్రాంతాలలో ఈ లాక్ డౌన్ అమలవుతుంది. ఈ నెల 22 వరకు అమలు చేస్తారని తెలుస్తోంది. అత్యవసర సేవలకు మిన