ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేష్ అంబానీకి ఆరో స్థానం
భారత దేశం లో అత్యంత సంపన్నుడు, అపర కుబేరుడు అయినా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో ఘనతని సాధించారు. గత వారం ముఖేష్ అంబాని వారెన్ బఫెట్ సంపదను దాటి, ప్రపంచ కుబేరుల వరుసలో ఏడవ స్థానం లో నిలిచారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, 72.4$ తో సిలికాన్ వాలీ టెక్ అధినేత ఎలోన్ మస్క్ మరియు గూగుల్ ఆల్ఫాబెట్ సహా వ్యవస్థాపకులైన సెర్గెయి బ్రిన్ మరియు లారీ పేజీ లను అధిగమించి, ప్రపంచ కుబేరుల వరుసలో ఆరో స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో డిజిటల్ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారు.