ఆంధ్ర ప్రదేశ్ లో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 44 మంది మృతి చెందారు. దీనితో రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 35,451 కి చేరుకోగా, మృతుల సంఖ్య 452 కి చేరుకుంది.
నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తం గా 3,20,161 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఒక్క రోజులో ఇంత ఎక్కువ మందికి పరీక్ష చేయడం ఇదే మొదటి సారి. దీనితో దేశ వ్యాప్తంగా, ఇప్పటి దాకా 1,24,12,664 మందికి,కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లయింది