ఏలూరు లో అంతు చిక్కని విధం గా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 267 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి దాకా 70 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ప్రాణ నష్టం జరగలేదు అయితే బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. మంత్రులు ఆళ్ళ నాని, పేర్ని నాని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మూర్ఛ, నిస్సత్తువ వంటి లక్షణాలు అందరిలో కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి దాకా అనారోగ్యానికి గల కారణాలు ధ్రువీకరించలేదు. జల కాలుష్య మా, వాయు కాలుష్య మా, నీటి కాలుష్యం మా – కారణాలు అంతు చిక్కడం లేదు.
ఈ 2020 లో, ఉపద్రవాలు ఎదో ఒక రూపం లో వెంటాడుతూనే ఉన్నాయి. త్వరగా ఏలూరు ప్రజలు ఈ పరిస్థితి నుండి బయట పడాలని మనమందరం ఆ భగవంతుడిని, వైద్యులను ప్రార్ధిద్దాం.
కాగా సీఎం జగన్ రేపు బాధితులను పరామర్శించాడని ఏలూరు వెళుతున్నారు