Home వార్తలు 08-12-2020 : రైతు రోడ్డు ఎక్కిన రోజు. ఆగ్రహించిన రోజు. రైతు చేసిన...

08-12-2020 : రైతు రోడ్డు ఎక్కిన రోజు. ఆగ్రహించిన రోజు. రైతు చేసిన భారత్ బంద్

రైతుల పోరాటానికి అన్ని వర్గాలనుంచి మద్దతు అనూహ్యం గా పెరుగుతోంది.  

అభివృద్ధి కోసం, మారుతున్నా కా లాలకు అనుగుణం గా చట్టాలను సవరించాల్సి ఉంటుంది.  ఇవి మోడీ గారు చెపుతున్న మాటలు.  ఆ మాటలను ఎవరు తప్పు పట్టడం లేదు.  అయితే సవరించిన చట్టాలు ప్రజలకు లేదా రైతులకు ఉపయోగపడేలా ఉండాలి.  అంటే అర్ధవంతం గా ఉండాలి.

రైతు సంక్షేమమే మోడీ గారి ఎజెండా అయితే రైతుల కోసం ఆ చట్టాలు మార్చడానికి ఎందుకు వెనుకాడుతున్నారు.   వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోనిది.  కేంద్రం, మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అత్యుత్సహం కనపరుస్తోంది.  మోడీ గారు పెర్మనెంట్ కాదు…రైతులు పెర్మనెంట్.  మోడీ గారు మెచ్చిన చట్టాలు కాదు….రైతు మెచ్చిన చట్టాలు తేవాలి.  రైతులు రోడ్డెక్కడం దేశానికి మంచిది కాదు.  ఎముకలు కొరికే చలిలో, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న లెక్క చేయకుండా, పోరాటం చేస్తుంటే మోడీ గారిలో చలనం ఎందుకు రావట్లేదు.  ఎందుకు అంత మొండి పట్టుదల.

బండి సంజయ్ గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లు పెరిగిన అహంకారం తో మాట్లాడుతున్నారు. మోడీ చట్టాలలో లొసుగులు లేకపోతే, మీరు వెళ్లి రైతులకు అర్ధం.  అయ్యేలా చెప్పచు కదా.  పాపమ్ మీ కేంద్ర మంత్రులు, మోడీ గారు రైతులకు అర్ధం అయ్యేలా చెప్పలేక పోతున్నారు.

కనీస మద్దతు ధరను ఎందుకు చట్ట బద్ధం చేయడం లేదు. ఎవరు ఎక్కడైనా పంటను అమ్ము కోవచ్చు అంటున్నారు.  హైదరాబాద్ చుట్టుపక్కల పంటను ఢిల్లీ లో అమ్ముకోగలరా.  ఎక్కడ వ్యవసాయం కూడా కార్పొరేట్ ఆధీనంలోకి వెళుతుందో అని రైతులు ఆందోలన చెందుతున్నారు.  ఈ రోజు ఆ సీట్లో మోడీ ఉన్నారు తరవాత ఎవరో వస్తారు.  ఎవరు రైతుల జీవితాలకు వ్రాత పూర్వకం గ భరోసా ఇస్తారు.  అన్ని పార్టీలు రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు.  పద్మ అవార్డులు వాపసు ఇస్తున్నారు.  మోడీ గారికి చీమ కొట్టినట్లుగా లేదు.

దేశం అంతా కాషాయ జెండా ఎలా ఎగరేయాలో అన్నదానిమీద ఉన్న శ్రద్ధ రైతు సమస్యల మీద మోడీ గారికి లేదు. 

రెండవ సారి ఎలక్షన్స్ ముందు కెసిఆర్ పథకం కాపీ కొట్టి గెలిచారు మీరు.   రైతులకు డైరెక్ట్ కాష్ స్కీం పథకం ప్రవేశ పెట్టి వోట్లను కాష్ చేసుకున్నారు.. అప్పుడే మరచి పోయారా సర్. 

తాడి ని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు.  గుర్తు పెట్టుకోండి కాషాయ వీరులారా…

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు