నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 20 రోజులు గా ఆందోళన చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. చట్టాలను రద్దు చేసేవరకు వెనక్కు తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు. అన్నదాతలు ఈ ఆందోనళనలను మరింత ఉధృతం చేసేలా ఉన్నారు. రైతులకు మద్దతుగా విద్యార్థులు కూడా ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనలకు మద్ధతు పెరుగుతూ ఉంది
ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాణాలర్పించిన అన్నదాతల కోసం ఈ నెల 20 న శ్రద్ధాంజలి దినంగా పాటిస్తామని రైతు నేతలు ప్రకటించారు
రైతులు తమ వైఖరి స్పష్టం గా తెలియ చేశారు. అయినా సరే ప్రభుత్వం చర్చలంటూ ఎందుకు కాలాయాపన చేస్తోందో తెలియడం లేదు.
ఇక్కడ అర్ధం కాని కొన్ని అంశాలు ఏమంటే
- రైతల కోసం చేసే చట్టాలను రైతులే వద్దంటుంటే ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తోంది…?
- నిజం గా రైతులకు మేలు చేసే చట్టాలైతే రైతులకు అర్ధం అయ్యే విధం గా ఎందుకు చెప్పలేక పోతున్నారు….?
- ప్రధానమంత్రి గా మోడీ గారు శాశ్వతం అనుకుంటున్నారా…?
- కార్పొరేట్ కంపెనీలకు ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధం ఉండదు అనే విషయాన్నీ చట్టంలో పెడతారా..?
- భారతీయ జనతా పార్టీ విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని పదే పదే చెపుతున్నారు. అధికారం లో ఉన్నది మీరు. రైతులతో చర్చలు జరుపుతున్నది మీరు…అటువంటప్పుడు, రైతులకు అర్ధం అయ్యేలా చెప్పే బాధ్యత మీదే కదా….?
- ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఎకానమీ మళ్ళి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- రైతుల ఆందోళనల వల్ల కొన్ని కోట్ల నష్టం అని CII వారు చెపుతున్నారు…ఈ నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు.?
- ప్రధాన మంత్రి మోడీ గారు స్వయం గా వచ్చి, ఈ నూతన చట్టాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి, రైతులకు అర్ధం అయ్యే విధం గా చెప్పవచ్చు కదా.