నార్వే దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం వృద్దులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు టీకా తీసుకోవద్దని సూచించింది. ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తొలి దశ టీకాలు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా.. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వే ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరందరూ వయసు పైబడిన వారే కావడం గమనార్హం. బలహీనంగా ఉన్న వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతర రోగులు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
అయితే మరణించిన 23 మందిలో 13 మందికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టుల్లో వ్యాక్సిన్ అనంతరం దుష్పరిణామాల వల్ల మరణించినట్లు నివేదిక వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్న వేళ ఇది పెను ప్రకంపనలు రేపుతోంది. నార్వేలో డిసెంబర్ చివరి వారం నుంచి మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆ దేశంలో ఇప్పటివరకు 33 వేలకు పైగా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.