Home వార్తలు అయోధ్య రామ మందిరానికి దిగ్విజయ్‌ సింగ్‌ విరాళం!

అయోధ్య రామ మందిరానికి దిగ్విజయ్‌ సింగ్‌ విరాళం!

అయోధ్య రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తనంతుగా విరాళాన్ని ఇచ్చినట్లు ప్రకటించాడు. అంతేకాకుండా దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి శక్తివంచన లేకుండా విరాళాలివ్వాలని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు దిగ్విజయ్‌ సింగ్‌ రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 11 వేల 111 విరాళం ఇచ్చాడు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు.దిగ్విజయ్‌ రాసిన ఆ లేఖలో తాము మత కలహాలకు వ్యతిరేకం కానీ..ఆలయ నిర్మాణానికి కాదని పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ హిందూవుల పార్టీ అని విమర్శించిన దిగ్విజయ్‌ సింగ్‌ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించడం విశేషం. గతంలో ఆయన ఆలయ నిర్మాణంపై విమర్శలు కూడా చేశారు. 
మరోవైపు 2020 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామమందిరానికి స్వయంగా భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ కోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా విరాళాలు అందజేస్తున్నారు.ఇటీవలే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా అయోధ్య రామమందిరం నిర్మాణానికి తనవంతుగా వ్యక్తిగత ఖాతా నుంచి రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు