Home వార్తలు గణతంత్ర వేడుకల్లో‘రఫేల్‌’ యుద్ధ విమానాల విన్యాసాలు...

గణతంత్ర వేడుకల్లో‘రఫేల్‌’ యుద్ధ విమానాల విన్యాసాలు…

జనవరి 26న జరిగే  గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో ర‌ఫేల్ ఫైట‌ర్ జెట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. దిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఒక రఫేల్‌ యుద్ధ విమానం పాల్గొని ‘వర్టికల్‌ ఛార్లీ’ విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) సోమవారం ప్రకటించింది. అలాగే ఈసారి గణతంత్ర వేడుకల్లో వాయుసేకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నట్లు ఐఏఎఫ్‌ వెల్లడించింది.


కాగా..ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఐదు రఫేల్‌ విమానాలు గతేడాది భారత్‌ చేరుకున్నాయి. సెప్టెంబరు 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా భారత వైమానిక దళంలో చేర్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లద్దాఖ్‌లో ఉన్నాయి. మరోవైపు గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఏడాది భారత్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను ఈసారి రద్దు చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ప్రకటించింది. కరోనా  మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు