డ్రాగన్ దొంగాట.. భారత భూభాగంలో చైనా అరాచకాలు..!
వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో కయ్యాలకు తెగబడుతున్న చైనా మరోసారి బరి తెగించింది. విస్తరణవాదంతో చెలరేగుతున్న చైనా భారత భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. 2020 నవంబర్-1న శాటిలైట్ ఈ ఫొటోలను తీసింది. చైనా నిర్మించిన గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు తెలియజేస్తున్నాయి..అరుణాచల్‌లోని సుబాన్సిరి జిల్లాలో తారిచు నది ఒడ్డున చైనా ఈ గ్రామాన్ని నిర్మించింది. అయితే, చాలా కాలంగా ఈ ప్రాంతం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమవుతోన్న విషయం తెలిసిందే.
భారత్ భూభాగమైన ఈ ప్రాంతాన్ని చైనా అనేక మార్లు తమకు చెందినదేనంటూ ప్రకటించింది. గతంలో ఇక్కడ పలు మార్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.అటువంటి చోట చైనా ఏడాది వ్యవధిలో ఓ గ్రామన్నే నిర్మించింది. అయితే, ఇదే ప్రాంతంలో ఆగస్ట్ 26-2019న తీసిన మరో ఫొటోలో ఎలాంటి నిర్మాణాలు కనిపించడం లేదు. అంటే ఏడాదిలోపే చైనా ఇక్కడ గ్రామాన్ని నిర్మించినట్లు అర్థమవుతోంది.కాగా..అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చేపట్టిని ఈ అక్రమ నిర్మణాల గురించి 2020 నవంబర్లోనే ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ తపిర్ గావో ప్రస్తావించారు. లోక్‌సభలో చైనా దొంగాట గురించి హెచ్చరించారు. ఇక తాజాగా దీనిపై తపిర్ స్పందిస్తూ..చైనా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా ఎగువ సుబన్సిరి జిల్లాలో నది వెంబడి 60-70 కిలోమీటర్లు లోనికి ప్రవేశించింది అని వెల్లడించారు.Attachments area