అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఇక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.. పశ్చిమబెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా.. మరోసారి అధికారం దక్కించుకోవాలని మమతా బెనర్జీ ప్రణాళికలు రచిస్తున్నారు…ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంటుందని సీ ఓటర్ సర్వే పేర్కొంది.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరి గెలుపు ఎలా ఉండబోతుంది..అనే ప్రశ్నతో సీ ఓటర్ సంస్థ సర్వే చేపట్టగా… పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండి 100 కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది. అయితే, అతిపెద్ద పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ నిలిచి మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు.. అధికార తృణమూల్ కాంగ్రెస్కు ఈసారి 158 సీట్లు రానున్నాయి. అంటే, గత 2016 ఎన్నికల్లో 211 సీట్లు గెలుచుకున్న టీఎంసీ, ఈసారి 53 సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి 102 సీట్లు సాధించనుంది. కాగా,లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి కేవలం 30 సీట్లకు మాత్రమే పరిమితం కానుంది. స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో గెలుస్తారు అని సీ ఓటర్ సంస్థ సర్వే వెల్లడించింది…