Home వార్తలు ఇండియా ఇన్నోవేషన్ Index Rankings...తెలంగాణకి 4..ఏపీకి 7వ ర్యాంకు

ఇండియా ఇన్నోవేషన్ Index Rankings…తెలంగాణకి 4..ఏపీకి 7వ ర్యాంకు

జాతీయ ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్)-2020 జాబితాను నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్-10లో చోటుదక్కించుకోగా.. కర్ణాటక తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 42.5 పాయింట్లతో ఆ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఒకస్థానం ఎగబాకి మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా.. గతేడాది రెండో స్థానంలో ఉన్న తమిళనాడు మూడో ర్యాంకుకు పడిపోయింది.ఉన్నత, సాంకేతిక విద్య, శాస్త్ర సాంకేతికత- పర్యావరణంపై మెరుగైన సామర్థ్యాన్ని కనబరిచిన తెలంగాణ.. నాలుగో ర్యాంకును కైవసం చేసుకుంది..కాగా, ఆవిష్కరణల సూచీలో ఆంద్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచి మూడు స్థానాలు ఎగబాకింది. 2019లో వెల్లడించిన సూచీలో 10వ స్థానంలో ఉన్న ఆంద్రప్రదేశ్.. తాజా నివేదికలో 7వ ర్యాంకు దక్కించుకుంది.


కాగా,జాతీయ ఆవిష్కరణల సూచీ–2020 నివేదిక కోసం నీతి ఆయోగ్‌ పలు అంశాలను ప్రాతిపదికలుగా తీసుకుంది. మూడేళ్ల సగటున ఉన్నత, సాంకేతిక విద్య, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ రంగాలకు పెట్టిన ఖర్చు, సులభతర వాణిజ్యం, రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్ల సంఖ్య, రాష్ట్రంలో ఉన్న సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్ల సంఖ్య వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించింది.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు