Home వార్తలు పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

పంచాయితీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా,హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.


కాగా,అంతకుముందు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వేసిన రిట్‌ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌ఈసీ ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది.. ఈ ఎన్నికల ప్రక్రియ నాలుగు విడుతల్లో జరుగనుందని ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది..అలాగే ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్‌సీఈ పేర్కొంది..

అత్యంత ప్రముఖమైనవి

‘గ‌జ‌కేస‌రి’గా వస్తోన్న కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఆకట్టుకుంటున్న టీజర్

క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యువ హీరో యశ్. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమాను జాతీయ మీడియా...

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఇటీవలి వ్యాఖ్యలు