Home వార్తలు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడంటే..?

కాంగ్రెస్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడంటే..?

కాంగ్రెస్‌ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో నిర్ణయం తీసుకున్నారని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు. కొద్ది నెలల్లో ఐదు రాష్ట్రాల్లో (కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి)  జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన అనంతరం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు.తొలుత ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలి. ఆ తర్వాత పార్టీ అంతర్గత ఎన్నికల గురించి ఆలోచించాలి అని అశోక్ గహ్లోత్, ఊమెన్ చాందీ వంటి అగ్రనేతలు వెల్లడించడంతో జూన్‌లో అధ్యక్ష ఎన్నిక జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.


కాగా,సీడబ్ల్యూసీ సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై వాడీవేడీగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కొంత మంది నేతలు గట్టిగా నిలదీసినట్లు సమాచారం..ఇదిలావుండగా..2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల అనంతరం సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.రాహుల్ గాంధీ మాత్రం తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు.

అత్యంత ప్రముఖమైనవి

సుకుమార్ కూతురి వేడుక‌లో ఎన్టీఆర్, మహేష్, చై ఫ్యామిలీస్ సందడి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్యా నమ్రతతో కలిసి సందడి చేయగా.. నాగచైతన్య,...

కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

'ఉప్పెన' సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువ నటి కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన...

‘ఆచార్య’ సెట్స్ లో సందడి చేసిన చిరు, చరణ్.. వైరల్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ...

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఇటీవలి వ్యాఖ్యలు