భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఆరుగురు భారత ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు.. ఖరీదైన బహుమతులతో వారిని అభినందించారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్‌గిల్, నవ్‌దీప్ సైని, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌లకు మహేంద్ర ఎస్యూవీ కార్లను అందిస్తానని ప్రకటించారు.ఈ ఆరుగురు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు…
కాగా,బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకున్న ఈ యువ కెరటాలు చక్కటి ప్రదర్శనతో రాణించారు ఈ నేపథ్యంలోనే మహ్మద్ సిరాజ్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయగా, నటరాజన్ అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి చక్కటి ప్రదర్శన చేశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ 62 పరుగులు, శార్దూల్ ఠాకుర్ 66 పరుగులు చేసి చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇక యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా గడ్డపై చెలరే గగా.. యువ పేసర్ నవ్‌దీప్ సైనీ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించాడు. వీరందరూ సమష్టిగా రాణించడంతో రహనేసేన 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై అద్బుత విజయం సాధించింది.