Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంద్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదలైంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.రాజ్యాంగ రచించిన అంబేద్కర్‌ మానసపుత్రికే ఎన్నికల సంఘం అని పేర్కొన్నారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్‌ విధి అని, సుప్రీం కోర్టులో నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామని, నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.


అయితే..ఎన్నికల నిర్వహణ లో ఇబ్బందులు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.‘‘ దీనిపై గవర్నర్ కు నివేదిస్తా, అవసరమైతే సుప్రీంకోర్టు కు కూడా నివేదిస్తా.  ఎన్నికల్లో పాల్గొనాలని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారి అభిప్రాయం గౌరవించాలి. మూడు రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం… రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి.  ఉన్న సవాళ్ళను అధిగమించి ముందుకు వెళ్తా. రాజ్యాంగ బాధ్యతలు పూర్తి చేయడానికే ముందుకు వెళ్తా అని ఆయన పేర్కొన్నారు.


కాగా,తొలి దశ ఎన్నికల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 5న సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ఎన్నికతో ముగియనుంది. 23న నోటిఫికేషన్‌ జారీ కాగా.. ఈ నెల 25నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 28న నామినేషన్ల పరిశీలన, 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన, 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు). అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ పూర్తయ్యాక సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఫలితాల వెల్లడించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు