Home వార్తలు దేశానికి 4 రాజధానులు కావాలి: మమతా డిమాండ్‌

దేశానికి 4 రాజధానులు కావాలి: మమతా డిమాండ్‌

సువిశాల భారతదేశానికి ఒకటే రాజధాని ఎందుకుండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని, రొటేటింగ్ పద్ధతిలో వాటిని వాడుకోవాలని సూచించారు.జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాజధానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశ్‌నాయక్‌ దివాస్‌గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. 


అయితే,బ్రిటీష‌ర్లు యావ‌త్ భారత్ దేశాన్ని కేవ‌లం కోల్‌క‌తా నుంచే పాలించార‌ని, దేశంలో ఒకే ఒక్క రాజ‌ధాని ఎందుకు ఉండాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఇవాళ దేశ‌నాయ‌క్ దివ‌స్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ట్లు ఆమె చెప్పారు.  నేతాజీని దేశ‌నాయ‌క్ అని ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌ పిలిచేవార‌ని, కానీ ప‌రాక్ర‌మ్ దివ‌స్ అని బీజేపీ నాట‌కాలు చేస్తున్న‌ట్లు ఆమె ఆరోపించారు. అలాగే,నేతాజీ పోర్ట్‌ పేరును శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ డాక్‌గా మార్చడంపై మమత విమర్శలు కురిపించారు. నేతాజీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని చెప్పుకుంటున్న భాజపా.. ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక కమిషన్‌ను ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలోనే వారికి నేతాజీ గుర్తొస్తారని దుయ్యబట్టారు. నేతాజీ జయంతిని పరాక్రమ్‌ దివస్‌గా ప్రకటించినప్పుడు కనీసం తనను సంప్రదించలేదని మమత ఆరోపించారు.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు