Home వార్తలు నన్ను ఆహ్వానించి అవ‌మానిస్తారా: మ‌మ‌తాబెన‌ర్జి ఫైర్

నన్ను ఆహ్వానించి అవ‌మానిస్తారా: మ‌మ‌తాబెన‌ర్జి ఫైర్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన నేడు కోల్‌కతా వచ్చారు. ఉత్సవాల వేదికైన విక్టోరియా మోమోరియల్‌కు మోదీ చేరుకున్నారు. వేడుకలు ప్రారంభమవడానికి ముందు విక్టోరియా మోమోరియల్‌ను సందర్శించారు. ప్రధాని వెంట బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా ఉన్నారు. 

అయితే అక్కడ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. సీఎం మమత మాట్లాడడానికి సన్నద్ధమవ్వడమే ఆలస్యం… సభలోని కొందరు ‘జై శ్రీరాం… జైశ్రీరాం’ అంటూ ఒక్కసారిగా నినాదాలు చేయడం ప్రారంభించారు.ఆమె ప్ర‌సంగం వినిపించ‌కుండా గోళచేశారు. దాంతో ఆగ్ర‌హానికి లోనైన మ‌మతాబెన‌ర్జి ‘ఆహ్వానించి అవ‌మనిస్తారా..?’ అని మండిప‌డ్డారు. అలాగే ,ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం ఏదైనా గౌర‌వంగా జ‌రుగాలి. ఇదేమీ పార్టీ కార్య‌క్ర‌మం కాదు. ఒక వ్య‌క్తిని మాట్లాడ‌మ‌ని ఆహ్వానించి, వారి ప్ర‌సంగం వినిపించ‌కుండా గోళ చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదు. త‌న‌కు జ‌రిగిన అవ‌మానానికి నిర‌స‌న‌గా నేను ఈ కార్య‌క్ర‌మంలో ఏమీ మాట్లాడ‌బోను అని చెప్పి మ‌మ‌తాబెన‌ర్జి త‌న స్థానంలోకి వెళ్లి కూర్చుకున్నారు.

కాగా, నేతాజీ జయంతికి పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. మరికొన్ని నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆధిపత్యం కోసం ఇటు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)తో పాటు.. భాజపా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఎన్నికల్లో గెలవడం కోసమే భాజపా ఆయన జయంతిని జాతీయ పరాక్రమ దివస్‌గా ప్రకటించిందని టీఎంసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో.. బ్లాక్ బస్టర్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన తరవాత ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ...

థియేటర్‌లో ‘హాకీ’ ఆడేందుకు దూసుకొస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌...

ఇటీవలి వ్యాఖ్యలు