Home వార్తలు దేశంలో బీజేపీతోనే అవినీతి నిర్మూలన: అమిత్‌ షా

దేశంలో బీజేపీతోనే అవినీతి నిర్మూలన: అమిత్‌ షా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తోనే దేశంలో అవినీతి, ఉగ్రవాదం అంతమవుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.అసోంలోని కొక్రాజహర్‌లో జరిగిన ర్యాలీనలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో అసోంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకుని బోడోల్యాండ్‌ అభివృద్ధికి దోహదపడాలని పిలుపు ఇచ్చారు. అలాగే అసోంలో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ ఉద్యమాలను ప్రేరిపించిందని, రాష్ట్రంలో అవినీతికి అండగా నిలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోంలో గడిచిన 70 ఏళ్లలో జరగని అభివృద్ధి గత ఐదేళ్లలో చోటుచేసుకుందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీ అసామీలు-అసామేతరులు, బోడోలు-బోడోయేతరుల మధ్య వివాదాలు రేకెత్తిస్తోందని ఆరోపించారు.కాగా, గత ఏడాది అసోంలో జరిగిన అల్లర్లలో పోలీసులు సమర్థంగా పనిచేసి, శాంతి భద్రతలను కాపాడారని అమిత్‌ షా కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన కొందరు పోలీసులను సత్కరించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు.

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు