Home వార్తలు ఆంద్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే!

ఆంద్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ దూకుడు పెంచింది. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికలకు సోమవారం నుంచే నామినేషన్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఉద్యోగులకు హడావుడి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని.. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నాలుగో విడతకు రీషెడ్యూల్ చేశారు. రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలు యథావిధిగా ముందుగా ప్రకటించిన విధంగా జరుగుతాయి. అంటే, గతంలో రెండో ఫేజ్‌లో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు మొదటి దశలోనూ, 3, 4 దశల్లో జరగాల్సిన ఎన్నికలు రెండు, మూడు దశల్లో జరుగుతాయి. 

తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

★ జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ ★ జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు ★ ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన ★ ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ★ ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం ★ ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ★ ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ★ ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

రెండో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్

★ ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ ★ ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు ★ ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన ★ ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ★ ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం ★ ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ★ ఫిబ్రవరి 13న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ★ ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

మూడో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్

★ ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ★ ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు ★ ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన ★ ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ★ ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం ★ ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ★ ఫిబ్రవరి 17న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ★ ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

నాలుగో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ★ ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ★ ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు ★ ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన ★ ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ★ ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం ★ ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ★ ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) ★ ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు