Home వార్తలు చావనైనా చస్తా కానీ అలా చేయను: మ‌మ‌తా బెన‌ర్జీ

చావనైనా చస్తా కానీ అలా చేయను: మ‌మ‌తా బెన‌ర్జీ

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కోల్‌కతా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జ‌యంతిని పుర‌స్కరించుకొని జనవరి 23న కోల్‌క‌తాలోని విక్టోరియా మెమోరియ‌ల్‌లో కార్యక్రమం నిర్వహించగా..దీనికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా మ‌మ‌తా బెన‌ర్జీని మాట్లాడాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. ఆమె ప్రసంగించడానికి సిద్ధం కాగానే సభకు హాజరైన కొంత మంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆమె ప్రసంగించకుండా అడ్డుతగిలారు. ఈ పరిణామం మమతా బెనర్జీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.


కాగా,ఈ వివాదంపై ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సోమ‌వారం స్పందించారు. ఆ నినాదాలు బెంగాల్‌ను అవ‌మానించ‌డ‌మే అవుతుంద‌ని హుగ్లీలో జ‌రిగిన ఓ సమావేశంలో ఆమె స్ప‌ష్టం చేశారు. జైశ్రీరామ్ నినాదాల క‌న్నా.. నేతాజీని ఉద్దేశించి నినాదాలు చేసి ఉంటే తాను వాళ్లకు సెల్యూట్ చేసేదానిన‌ని ఆమె అన్నారు. త‌న గొంత‌యినా కోసుకుంటాను కానీ.. బీజేపీ ముందు మాత్రం త‌ల‌వంచ‌ను అని మ‌మ‌తా పేర్కొన్నారు.మోదీ స‌మ‌క్షంలో వాళ్లు న‌న్ను అవమానపర్చడానికి ప్ర‌య‌త్నించారు. నేతాజిని మీరు పొగిడి ఉంటే నేను మీకు సెల్యూట్ చేసేదానిని. మీరు న‌న్ను టార్గెట్ చేస్తే.. ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు. వాళ్లు ఆ రోజు చేసిన ప‌ని బెంగాల్‌కే అవ‌మానం అని మ‌మ‌తా అన్నారు. త‌మ పార్టీ నేత‌లు బీజేపీలో చేర‌డంపై స్పందిస్తూ.. ప్ర‌జ‌లకు సేవ చేసేవాళ్ల‌కే తాము టికెట్లు ఇస్తామ‌ని, మిగ‌తా వాళ్లు బీజేపీలోకి వెళ్లిపోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు