ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం భారత్‌కు బయలుదేరాయి. యూఏఈ ఎంఆర్టీటీ ద్వారా గాలిలోనే నింధనం నింపుకున్న ఈ యుద్దవిమానలు ఏకధాటిగా ప్రయాణించి గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్ బేస్‌కు రాత్రి 11 గంటలకు చేరనున్నాయి.కాగా,అత్యాధునిక యుద్ధ విమానాలైన 36 రాఫెల్స్‌ను రూ.59 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
గత ఏడాది జూలై 29న తొలుత ఐదు రాఫెల్ జెట్స్ పంజాబ్‌లోని అంబాలా ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాటిని లాంఛనంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. గత ఏడాది నవంబర్‌లో మరో మూడు రాఫెల్స్ జామ్‌నగర్ ఎయిర్ బేస్‌కు చేరాయి. తాజాగా మరో మూడు రాఫెల్స్ బుధవారం రాత్రికి జామ్‌నగర్ ఎయిర్ బేస్‌కు చేరుతాయి. దీంతో భారత వైమానిక దళంలో రాఫెల్స్ జెట్స్ సంఖ్య 11కు చేరనున్నాయి.మరోవైపు వాయుసేన అమ్ములపొదిలోకి చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాఫెల్ విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. బ్రహ్మాస్త్రం రూపంలో చేసిన విన్యాసం అబ్బురపరిచింది. గణతంత్ర పరేడ్‌లో రాఫెల్ విమానాలు పాల్గొనటం ఇదే తొలిసారి కావడం విశేషం.Attachments area