Home వార్తలు సినిమా ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం

సినిమా ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్19 ఆంక్షలను దాదాపుగా సడలించింది. సినీప్రియులకు, పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు గుడ్ న్యూస్ అందించింది. కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. జనవరి 31తో గతంలో విధించిన నిబంధనలకు గడువు ముగుస్తుండటంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


* దేశంలో క్రీడాకారులే కాకుండా అందరూ స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త మార్గదర్శకాలను ఆయా శాఖలు విడుదల చేస్తాయని పేర్కొంది.
* కంటైన్‌మెంట్‌ జోన్‌ల వెలుపలి అన్ని కార్యకలాపాలకూ అనుమతి
* గతంలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. ఈసారి అధిక సామర్థ్యంతో తెరుచుకోవచ్చని తెలిపింది. 
* రవాణా సౌకర్యాలపై ఆంక్షలను పూర్తిగ తొలగించింది. రాష్ట్రాలు- రాష్ట్రాలు మధ్య, రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఇ-పర్మిట్, స్పెషల్ పర్మిషన్ లాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదని తెలిపింది.
* ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు
* 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అత్యంత ప్రముఖమైనవి

పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు....

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇటీవలి వ్యాఖ్యలు