కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి ప్రారంభించిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తొలి ఆరు రోజుల్లో 10 లక్షల మందికి వేగంగా వ్యాక్సిన్ అందించిన దేశంగా భారత్ సరికొత్త రికార్డును సాధించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.కాగా,అమెరికా 10 రోజుల్లో 10 లక్షల మందికి టీకాలు వేయగా, స్పెయిన్ 12 రోజుల్లో, ఇజ్రాయెల్ 14 రోజుల్లో, యూకే 18 రోజుల్లో, ఇటలీ 19 రోజుల్లో, జర్మనీ 20 రోజుల్లో, యూఏఈ 27 రోజుల్లో ఈ ఘనత సాధించాయి. అంతకుముందు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.
ఇక జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ మధ్యాహ్నం 2గంటల వరకు దేశ వ్యాప్తంగా 25,07,556మందికి టీకా పంపిణీ జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.కాగా,ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,73,740 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. వీటిలో కేరళలో 72,476, మహారాష్ట్రలో 44,624 ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 19.4 కోట్ల శాంపిల్స్ పరీక్షించగా.. 1,07,01,193మందికి వైరస్ సోకింది. వీరిలో 1,03,73,606 మంది (96.94%) కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,53,847మంది ప్రాణాలు కోల్పోయారు.Attachments area