తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయంది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఇంటర్నల్ పరీక్షలయిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను ఏప్రిల్ 1న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహించనున్నామని చెప్పారు. ఒకేషనల్ కోర్సులకూ ఇదే టైంటేబుల్ వర్తిస్తుందని ప్రకటించింది.
కాగా,ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 11 వరకు తుదిగడువు విధించినట్లు బోర్డు తెలిపింది. రూ. 100 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 22 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో మార్చి 2వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మార్చి 9 వరకు, అదే రూ. 2 వేల ఆలస్య రుసుముతో మార్చి 16వ తేదీ వరకు ఫీజు చెల్లింపు గడువును నిర్దేశించింది..Attachments area