Home వార్తలు ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన నామినేషన్లు: ఎన్నికలు ఎప్పుడంటే..!

ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన నామినేషన్లు: ఎన్నికలు ఎప్పుడంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 168 మండలాల్లో గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి 13 వేలకు పైగా నామినేషన్లు రాగా, వార్డు మెంబర్‌కు 35 వేలకు పైగా నామినేష‌న్లు వచ్చాయి.ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు.కాగా, ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకూ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.

ఏపీలో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు:
కృష్ణా జిల్లా – విజయవాడ ;గుంటూరు జిల్లా – తెనాలి ; ప్రకాశం జిల్లా – ఒంగోలు ; నెల్లూరు జిల్లా – కావలి; కర్నూలు జిల్లా – నంద్యాల, కర్నూలు ; శ్రీకాకుళం జిల్లా – శ్రీకాకుళం,టెక్కలి,పాలకొండ ; విశాఖపట్నం జిల్లా – అనకాపల్లి ; తూర్పుగోదావరి జిల్లా – కాకినాడ, పెద్దాపురం ; పశ్చిమగోదావరి జిల్లా – నర్సాపురం

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు