Home వార్తలు రాముడి జన్మస్థలంపై నేపాల్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

రాముడి జన్మస్థలంపై నేపాల్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

నేపాల్‌ ప్రధానమంత్రి కేపీశర్మ ఓలీ మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం చిత్వన్‌లో జరిగిన నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌సీపీ) సమావేశంలో మాట్లాడుతూ…శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని…అయోధ్యపురిలో రామాలయ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాముడి విగ్రహం రూపుదిద్దుకుందని, సీతామాత విగ్రహం రూపుదిద్దుకుంటుందని, లక్ష్మణుడి, హనుమంతుడి విగ్రహాలను కూడా చేయించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది శ్రీరామ నవమికి అయోధ్యాపురిలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.కాగా,గతంలో కూడా నేపాల్‌ ప్రధాని బీర్‌గంజ్ సమీపంలో నిజమైన అయోధ్య ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు పుట్టిన అసలైన అయోధ్య నేపాల్‌లో ఉన్నదని, శ్రీరాముడు భారతీయుడు కాదు నేపాలీ అంటూ ఓలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి..

ఇక అంతకుముందు కేపీశర్మ ఓలీ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ దేశానికి కరోనా నిరోధక వ్యాక్సిన్‌ను సరఫరా చేసినందుకు గానూ కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఈ మేరకు.. కరోనా వ్యాక్సిన్‌ ద్వారా మహమ్మారిని కట్టడి మరింతగా కట్టడి చేసే అవకాశం లభించింది. ఇందుకుగానూ మా పొరుగు దేశం భారత్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన వారం రోజుల్లోనే మాకు కూడా వ్యాక్సిన్‌ పంపించారు’ అని ఓలి పేర్కొన్నారు. కాగా, కోవిడ్‌ బారి నుంచి భారత్‌ తనను తాను కాపాడుకుంటూనే పొరుగు దేశాలకు కూడా సాయం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు