Home వార్తలు సినీ ప్రియులకు కేంద్రం గుడ్ న్యూస్: థియేటర్లు ఇకపై ఫుల్

సినీ ప్రియులకు కేంద్రం గుడ్ న్యూస్: థియేటర్లు ఇకపై ఫుల్

దేశంలోనిబ్సినిమా థియేటర్లలో సామర్థ్యాన్ని వంద శాతానికి పెంచినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా  50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభించడానికి 2020 అక్టోబర్‌లో కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో థియేట‌ర్ల యజమానులు తాము న‌ష్టాల పాల‌వుతున్న‌ట్లు చెప్పారు. ఇప్పుడు వంద శాతం సీట్లు నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజ‌ర్లు, టెంప‌రేచ‌ర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్‌, బుకింగ్స్‌లో మార్పులు చేయాల‌ని ఆ మార్గ‌ద‌ర్శకాల్లో కేంద్రం స్ప‌ష్టంగా ఆదేశించింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు:

1. థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.
2. ప్రవేశం వద్ద శరీరా ఉష్ణోగ్రతను కొలిచే ‘థర్మల్‌ స్ర్కీనింగ్‌’ ఏర్పాట్లు ఉండాలి.
3. హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
4. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు.
5. టికెట్లు కొనుగోలు చేసే ప్రాంతంలో, థియేటర్‌ వెలుపల వెయిటింగ్‌ రూమ్స్‌ వద్ద ప్రేక్షకులు తప్పనిసరిగా ఆరు అడుగుల దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి.

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు