Home వార్తలు రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం: కేంద్రం

రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం: కేంద్రం

వివాదాస్పదంగా మారిన సాగు చట్టాలను రద్దుచేయాలని ఉద్యమిస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంగళవారం కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రతిపక్షాల ఆందోళనలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దీంతో 5 గంటలకు ప్రారంభమైన జీరో అవర్‌లో వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను చర్చించేందుకు కేంద్రం పార్లమెంటు బయట, లోపల ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందన్నారు.

కాగా,కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ ఛౌదరి ప్రశ్నలకు సమాధానంగా తోమర్‌ స్పందించారు. అధిర్‌ రంజన్‌ ఛౌదరి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమంలో 170కి పైగా రైతులు మరణించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు నిరంకుశత్వాన్ని తలపిస్తుందన్నారు. సభలో శివసేన, కాంగ్రెస్‌, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ పార్టీ సభ్యులు రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్‌ సభను 7 గంటల వరకూ వాయిదా వేశారు. రైతులకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ సిద్ధం చేసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో అడగాలని స్పీకర్ ప్రతిపక్షాలకు సూచించారు.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు