Home వార్తలు రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు

రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అలాగే, సదుంలోని ‘పీపల్‌ గ్రోవ్‌’‌ పాఠశాలకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 7 తేదీల వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా..గురువారం సాయంత్రం దిల్లీ నుంచి బయల్దేరనున్న రాష్ట్రపతి కోవింద్‌ బెంగళూరు చేరుకుంటారు. ఫిబ్రవరి 5న బెంగళూరులో జరుగుతున్న ఎయిరో ఇండియా-2021 కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 6వ తేదీన  కొడగు జిల్లాలో పర్యటించనున్న కోవింద్‌.. జనరల్‌ తిమ్మయ్య పూర్వీకుల ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. 7న బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లో అదేరోజు పర్యటన పూర్తిచేసుకొని దిల్లీకి తిరుగు పయనం కానున్నారు.కాగా,రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

థియేటర్‌లో ‘హాకీ’ ఆడేందుకు దూసుకొస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌...

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

ఇటీవలి వ్యాఖ్యలు