Home వార్తలు ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరద: 150 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరద: 150 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో భారీ మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. చమోలీ జిల్లాలోని జోషి మఠ్‌లో ధౌలి గంగ నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్‌లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. కాగా..వరదల ప్రభావం ఉత్తర ప్రదేశ్‌పై కూడా పడింది. ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అలాగే ధౌలిగంగా నదీ తీరానికి వెళ్లొద్దని స్థానికులకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో ధౌలిగంగా తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.కాగా..ఈ సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ వెంటనే ఘటనాస్థలికి బయల్దేరారు.  సీఎంతో పాటు చమోలి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కూడా ఉన్నారు.

ఇక  ఉత్తరాఖండ్‌ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరాతీశారు. ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే, ఏదైనా సహాయం కావాలంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ నెంబరు 107 లేదా 955744486కి కాల్ చేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు కేబినెట్‌ సెక్రటేరియట్‌లో సహాయ చర్యల సమీక్ష నిమిత్తం హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ దళాల డీజీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అలాగే సహాయక చర్యల నిమిత్తం రెండు ఎంఐ-17తో పాటు ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ చాపర్‌ను రంగంలోకి దింపినట్లు భారత వాయుసేన అధికారులు తెలిపారు. అవసరమైతే మరిన్ని విమానాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

కాగా..ఉత్తరాఖండ్‌ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అసోం పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు