Home ప్రత్యేకం మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… మళ్ళీ లాక్ డౌన్…

మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… మళ్ళీ లాక్ డౌన్…

ఒక పక్కా వాక్సిన్ వచ్చిందని ఆనందపడుతున్నా, మరో పక్క కరోనా మళ్ళీ విజృంభిస్తోన్న ఆందోళన ఎక్కువగా ఉంది.   మహారాష్ట్రలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలో వారం రోజుల పాటు అంటే ఫిబ్రవరి 22 నుండి మార్చ్ 1 వరకు లాక్ డౌన్ విధించారు.  పూణే లో రాత్రి పూట కర్ఫ్యూ అమలులో వుంది.  మహారాష్ట్ర లో నిన్న 6281 కరోనా కేసులు నమోదయ్యాయి.  వీటిలో 27 శాతం అంటే 1700 కేసులు అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ లోనే నమోదయ్యాయి.

ఒక్క మహారాష్ట్రలోని కాదు, కేరళ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కరోనా చాపకింద నీరులా మళ్ళి వ్యాపిస్తోంది. 

2020 మార్చ్ లో విజృంభించడం, ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం మనందరికీ గుర్తుండే ఉంటుంది.  మళ్ళి 2021 మార్చ్ వస్తోంది.  వైరస్ ఎన్నో అంతు చిక్కని రూపాలను సంతరించుకుంటోందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాక్సిన్ వచ్చిందన్న నిర్లక్ష్యం వద్దు.   మాస్క్ లను ధరించడం, చేతులు శుభ్రం గా కడుక్కోవడం, ఫీజికల్ డిస్టెన్స్ పాటించడం మర్చిపోవద్దు.  అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పోషకాహారం తీసుకోండి.  మన ఆరోగ్యం మన చేతుల్లోనే

మన అజాగ్రత్త మన దేశ ఎకానమీ మీద కూడా పడుతుంది.  జాగ్రత్తగా ఉండండి

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు