Home క్రీడలు రసకందాయంలో ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ ల మ్యాచ్

రసకందాయంలో ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ ల మ్యాచ్

రైజ్ ది బాట్ సిరీస్ లో భాగం గా ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.  ఇంగ్లాండ్ 170 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకు ముందు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 204 పరుగులకు మరియు వెస్ట్ ఇండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 318 పరుగులకు అల్ అవుట్ అయిన విషయం తెలిసిందే.  ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు బుర్న్స్ 42 పరుగులు మరియు సిబ్ లే 50 పరుగులు చేసి పునాది వేశారు.    క్రాలే 76 పరుగులు స్టోక్స్ 46 పరుగులు చేసారు

వెస్ట్ ఇండీస్ బౌలర్లలో గాబ్రియేల్ 3 వికెట్లు, చేజ్ మరియు  జోసెఫ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.  మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ వెన్ను విరిచిన విండీస్ కెప్టెన్ హోల్డర్ కి రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ మాత్రమే లభించింది.

ఆట ఐదవ రోజు కు ఆట రసవత్తరం గా మారింది.  గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఎవరు గెలిచినా క్రికెట్ గెలిచినట్లే అవుతుంది.  ఈ మ్యాచ్ సజావుగా సాగితే, ఈ ప్రేరణతో మరియు ఉత్సాహంతో మరిన్ని మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంటుంది

అత్యంత ప్రముఖమైనవి

వెండితెరపైకి గాన గంధర్వుడు ‘ఎస్పీ బాల సుబ్రమణ్యం’ బయోపిక్‌

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న మరణించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్...

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఇటీవలి వ్యాఖ్యలు