సరిగ్గా ఇదే రోజున గత ఏడాది 2019 లో ,ఇంగ్లాండ్ మరియు న్యూజి లాండ్ జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. నాలుగు దశాబ్దాల కు గాని, ఇంగ్లాండ్ కు ప్రపంచ కప్ ను ముద్దాడే అవకాశం రాలేదు. లార్డ్స్ మైన్దనం లో, నరాలు తెగే ఉత్కంఠ పోరులో, అనూహ్యం గా ఇంగ్లాండ్ ను విజయం వరించింది.
సూపర్ ఓవర్ లో కూడా స్కోర్ లు సమమయ్యాయి. బౌండరీల ఆధారం గా ఇంగ్లాండ్ ను విజేత గా ప్రకటించారు. ఐసీసీ నిబంధనలు ఇంగ్లాండ్ కు అనుకూలించాయి. జట్టు గా న్యూజి లాండ్ పోరాట పటిమ అద్భుతం. అంచనాలు లేకుండా ఫైనల్ కు రావడమే కాకుండా, ఇంగ్లాండ్ కు ముచ్చెమటలు పట్టించింది.
అంపైర్ కుమార ఢర్మ సేన తప్పిదం,రాస్ టేలర్ ఓవర్ త్రో న్యూజి లాండ్ కొంప ముంచాయి. న్యూజి లాండ్ కు వరస గా ఇది రెండో వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి. 2015 లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ప్రత్యర్థి జట్టు లైనప్ ఎంత పెద్దదిగా ఉన్నా, క్రీడా స్ఫూర్తితో పోరాడే యోధులు, న్యూజి లాండ్ ఆటగాళ్లు.
వీళ్ళండి నిజమైన కర్మ యోగులు.