రైజ్ ది బాట్ సిరీస్ లో భాగంగా, ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య ప్రారంభమైన రెండవ టెస్ట్ మ్యాచ్ లో, మొదట టాస్ గెలిచి వెస్ట్ ఇండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
ఎనభై పరుగుల కే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను స్టోక్స్ మరియు సిబ్ లే అద్భుతమైన పోరాట పటిమ తో ఆదుకున్నారు. స్టోక్స్ 59, సిబ్ లే 86 పరుగులతో అజేయం గా నిలిచారు. వీరిద్దరు నాలుగో వికెట్ కు అజేయం గా 126 పరుగులు జోడించారు.
ఈ మ్యాచ్ తో జట్టు లోకి వచ్చిన రూట్ 23 పరుగులకే వెను తిరిగాడు. చేజ్ కు 2 వికెట్లు, జోసెఫ్ కు ఒక వికెట్ దక్కాయి
మొదటి టెస్ట్ లో ఓటమి తెచ్చిన ప్రతీకారేచ్చో ఏమో, రెండవ టెస్ట్ మొదటి రోజు ముగిసే సమయాని ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆట మొదట్లో కొంత తడబడిన, మంచి ఆరంభమే అని చెప్పాలి