T20 సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి వుండగానే గెల్చుకుని, వన్ డే సిరీస్ ఓటమి కి ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు.
మొదట బాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ప్రారంభంలో వేడ్ ముప్పై రెండు బంతుల్లో 58 పరుగులు చేసివిధ్వంసం సృష్టించాడు. ప్రమాదకరం గా మారుతున్న మాక్స్వెల్ ను శార్దూ ల్ తెలివిగా బోల్తా కొట్టించాడు. అయితే స్మిత్ నిలకడగా ఆడి 46 పరుగులు చేశాడు. భారత బౌలర్ల లో యువ సంచలనం నటరాజన్, అద్భుతం గా బౌలింగ్ చేసాడు. నాలుగు ఓవర్ల లో కేవలం 20 పరుగులు ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు.
195 పరుగుల లక్ష్యం తో ఆట ఆరంభించిన భారత్ కు రాహుల్, ధావన్ లు మంచి శుభారంభమే అందించారు. రాహుల్ 30 పరుగులు, ధావన్ 52 పరుగులు చేయగా, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఆట ఆఖర్లో తడబడిన, హార్డిక్ పాండ్య విధ్వంసంతో, భారత జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకో గలిగింది.
అందరు ఊహించినట్టుగానే కేవలం 22 బంతుల్లో 42 పరుగులు చేసిన పాండ్యా మాన్ అఫ్ ది మ్యాచ్ గ ఎంపికయ్యాడు. చివరి T20 మంగళవారం జరుగుతుంది.