Home క్రీడలు బ్రిస్బేన్‌ టెస్టు..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 369 ఆలౌట్

బ్రిస్బేన్‌ టెస్టు..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 369 ఆలౌట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకి  ఆలౌట్ అయింది.ఓవర్ నైట్ స్కోరు 274/5తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ టిమ్ పైన్ 104 బంతుల్లో 6ఫోర్లతో 50 పరుగులు చేసి అర్థ శతకంతో చెలరేగగా.. కామెరూన్ గ్రీన్ 107 బంతుల్లో 6ఫోర్లతో 47 పరుగులు చేసి రాణించాడు.వీరిద్దరూ 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్‌గా పైన్‌ ఔటైన తర్వాత ఆసీస్‌ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్‌ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్‌ 24 పరుగులు చేశాడు.భారత బౌలర్లలో శార్దుల్‌, వాషింగ్టన్‌, నటరాజన్‌ మూడేసి వికెట్లు తీయగా, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.ఇదిలావుండగా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సిరీస్‌ సమానంగా ఉన్నాయి.చివరి టెస్ట్‌లో ఎవరి గెలిస్తే వారికే సిరీస్‌ దక్కుతుంది. దీంతో నాలుగో టెస్టులో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రం‍గా కష్టపడుతున్నాయి. భారత్ 1/55

అత్యంత ప్రముఖమైనవి

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు. ...

మహిళల అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ – మార్చ్ 7 నుంచి

భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్ దక్షిణ ఆఫ్రికా తో సిరీస్ తో ఆరంభమవుతోంది.  బి సీ సీ ఐ వన్ డే మరియు టి 20ల మహిళా జట్లను...

ఇటీవలి వ్యాఖ్యలు